![]() |
![]() |
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. శంభో శివ శంభో పేరుతో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఇందులో ఒక ఇంటరెస్టింగ్ విషయం ఐతే బయట పడింది. ఇంతకు అదేంటో చూద్దాం. నూకరాజు ఈ షోకి కాషాయ వస్త్రాలు వేసుకుని కమండలం పట్టుకుని దేశముదురులో గడగడా గుడుంబా శంకర్ అంటూ ఆలీ ఎలా ఉంటాడో ఆ గెటప్ లో వచ్చాడు. తర్వాత రామ్ ప్రసాద్ ని నూకరాజు పిలిచాడు. "రామ్ ప్రసాద్ గారు మీరొస్తే ఒకరి గురించి చెప్పాలి" అన్నాడు. తర్వాత రాంప్రసాద్ వచ్చి "స్వామి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా రష్మీకి పెళ్లవుతుందా" అని అడిగాడు. దానికి రష్మీ "ఇది ఒక ఎపిసోడ్ పడుతుందిలే" అంటూ కామెడీగా చెప్పింది. తర్వాత నూకరాజు నేల మీద కూర్చుని ఏదో ముగ్గు వేస్తూ "ఓం సుడిగాలిం..సుడిగాలిం" అన్నాడు దానికి రష్మీ ఓ రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.
తర్వాత నూకరాజు మళ్లీ "కాదు కాదు..ఆది గాలిం" అన్నాడు. దానికి రష్మీ "ఎహ్" అంటూ చిరాగ్గా ముఖం పెట్టింది. "ఆది ఈ మధ్య మీకు ట్రై చేస్తున్నాడు. కానీ మీకు తెలియట్లేదు" అనేశాడు ఫ్లోలో. దానికి రష్మీ కూడా షాకయ్యింది. ఆ తర్వాత జడ్జ్ ఇంద్రజ ఐతే "అవునా" అంది. "ఒక్క నిమిషం రష్మీకి పెళ్లవుతుందో లేదో చెప్తాను" అంటూ మంత్రించిన నిమ్మకాయను వదిలాడు. అది రష్మీకి కొంచెం ముందుగా వచ్చి ఆగింది. "కష్టం ఈ నిమ్మకాయతో జ్యూస్ చేయడం కష్టం" అని చెప్పాడు "రష్మీ పెళ్లెప్పుడవుతుందో తెలుసా ..సరిగ్గా పది సంవత్సరాల తర్వాత" అన్నాడు. "అప్పటికి రష్మీ ముసల్ది ఐపోతుంది కదా" అన్నాడు రాంప్రసాద్. "ఏ ఏంటి మీరు అవుతారు ముసలోళ్ళు" అని రష్మీ కౌంటర్ వేసేసరికి ఇంద్రజ ఊరుకోలేదు.. "అసలు పదేళ్ల తర్వాత ఆ నూకరాజు ఉంటాడో లేదో చూడండి" అంది అంతే నూకరాజు ఫేస్ మాడిపోయింది.
![]() |
![]() |